YSRCP Protests: రైతుల పేరుతో వైసీపీ పోరుబాట.. కూటమి సర్కారు రియాక్షన్ ఇదే.

ఏపీ వ్యాప్తంగా వైసిపి నేతలను మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడకక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు..ప్రస్తుతం ప్రత్యేక యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనోదంటూ పోలీసులు పేర్కొంటున్నారు.
ఇంతకీ వైసీపీ నేతలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.వారు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఉందని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్లో సైతం యూరియా దొరకని పరిస్థితి ఏపీలో దాపరించిందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఏపీ వ్యాప్తంగా మీడియా సమావేశాలు పెట్టి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో రైతుకు అండగా రైతు బాట కార్యక్రమంలో భాగంగా డివిజన్ కేంద్రంలో ఉన్న ఆర్డీవోకు కలెక్టర్కు వినతి పత్రాలు అందించే ప్రత్యేక కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాల్లో సైతం రైతులతో కలిసి దీక్ష చేపట్టి అనంతరం ప్రత్యేక వినతిపత్రం ఆర్డీవోకు అందించాలని వైసీపీ తీర్మానం చేసింది.
ఈ నేపథ్యంలో ఆర్జీవో కార్యాలయంకి చేరకముందే వైసిపి నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు..నివాసాలకే ఈరోజు పరిమితం కావాలంటూ ప్రత్యేక లెటర్లు అందించి సంతకాల సేకరించారు.